తెనాలి నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జ్యోతిరావ్ ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు, శ్రీను తదితర బీసీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఫూలే ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఫూలే స్ఫూర్తితో బీసీలకు అండగా ఉంటామని తెలిపారు.