సంక్రాంతి వేడుకల్లో భాగంగా గాలిపటాలు ఎగురు వేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని శనివారం తెనాలి డివిజన్ విద్యుత్ శాఖ ఈడీఈ బి. అశోక్ కుమార్ సూచించారు. బిల్డింగులపై, కరెంటు తీగల వద్ద గాలిపటాలు ఎగరవేయవద్దని, పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. గాలిపటాలు ఎగరవేసే సమయంలో కరెంటు వైర్లకు దూరంగా ఉండాలని చెప్పారు. అడ్డంకులు లేని ఖాళీ ప్రదేశాల్లో పతంగులు ఎగురవేసుకోవాలని సూచించారు.