వాట్సాప్, టెలిగ్రామ్ వేదికల్లో అపరిచితుల నుంచి వచ్చే ‘APK’ ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయొద్దని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ప్రభుత్వ అధికారుల గ్రూపుల్లో చేరమంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దని అన్నారు. వీటివల్ల మీ ఫోన్ హ్యాక్ అయి, యాప్స్ నుంచి డబ్బులు లాగేసే ప్రమాదం ఉందని తెలిపారు. హ్యాకర్లు మీ పేరుతో ఇతరులకు సందేశాలు పంపవచ్చని హెచ్చరించారు.