తెనాలిలోని పాండురంగపేట రైలు పట్టాలపై గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందాడు. దీంతో హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులకు అంత్యక్రియలు చేశారు. 8 రోజులుగా వృద్ధుడి మృతదేహం మార్చురీలో ఉన్న ఆయనకు సంబంధించిన వారు ఎవరూ రాకపోవడంతో రైల్వే హెల్పింగ్ సోల్జర్స్ సభ్యులకు సమాచారం అందించారు. మానవత్వంతో స్పందించి వారు అనాథ వృద్ధుడి అంత్యక్రియలు పూర్తి చేశారు.