తెనాలిలోని మల్లెపాడు ద్వారకానగర్ లో గుత్తి చప్పుడు కాకుండా వ్యభిచారం నడుస్తుంది అంటూ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని ఆదివారం నాడు అరెస్ట్ చేశారు తెనాలి పోలీసులు. ఈ నేపథ్యంలో వారిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇద్దరు నిర్వాహకులతో పాటు నరసరావుపేటకు చెందిన మహిళ, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని సీఐ తెలిపారు.