తెనాలి ప్రాంతంలో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ జనార్ధనరావు హెచ్చరించారు. ప్రత్యేకంగా తెలియని నంబర్ల నుంచి వచ్చే సందేశాలు, ప్రభుత్వ గ్రూపుల్లో చేరమని వచ్చే లింకులు నమ్మొద్దని సూచించారు. అలాంటి లింకులు ఓపెన్ చేస్తే లేదా 'ఏపీకే' ఫైల్‌లు డౌన్లోడ్ చేస్తే ఖాతాలు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.