తెనాలిలో మంగళవారం ఓ విషాదకర ఘటన జరిగింది. గంగానమ్మపేటకు చెందిన వ్యాపారి సుబ్రహ్మణ్యం (55) గుండెపోటుతో మృతి చెందగా, దాన్ని తట్టుకోలేక కుమార్తె లక్ష్మీశ్రావణి (23) భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒకేసారి తండ్రి, కుమార్తె కారణంగా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.