తెనాలిపట్టణం లోని చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన గండికోట గోపి ని గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 2021లో తాలూకా పోలీస్ స్టేషన్లో అతనిపై గంజాయి కేసు నమోదు చేసి అరెస్టు చేయగా, 2023 నుంచి అతడు కోర్టు వాయిదాలకు హాజరు కావడంలేదని ఎస్ఐ ఆనంద్ తెలిపారు. న్యాయమూర్తి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా, నిందితుడిని అరెస్టు చేశామన్నారు. కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించారన్నారు.