వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలని అమర్తలూరు ఎస్సై జానకి అమరవర్ధన్ అన్నారు. బాపట్ల ఎస్పీ ఆదేశాలు మేరకు బుధవారం సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు అందరు హెల్మెట్ ధరించాలన్నారు. కారు నడిపే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. తమ యొక్క వాహనాలకు సంబందించిన పత్రాలు అన్నింటిని వెంట పెట్టుకోవాలన్నారు.