తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తెలిపారు. అమర్తలూరు మండలంలో బుధవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు.