ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని ఆపదలో ఉన్న పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు అన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న ఎనిమిది మంది కి 3, 83, 506 రూపాయల చెక్కులను శనివారం ఆనందబాబు అందజేశారు. భట్టిప్రోలు మండలానికి చెందిన ఎనిమిది మందికి క్యాంపు కార్యాలయంలో చెక్కులను అందించారు.