భట్టిప్రోలు: చేనేతలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి

76చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చేనేత కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి మురుగుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వం చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ భట్టిప్రోలు తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చేనేత సహకార సంఘాలకు రావాల్సిన రూ.156 కోట్ల బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్