ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఆయన ఇంకొల్లు మండలం ఇంకొల్లులో సోమవారం మాట్లాడారు. సీఎం ఇచ్చిన హామీల మేరకు పెన్షన్లు పెంచి ఇవ్వటం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3, పేదల కోసం 200 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారన్నారు.