ఆపద సమయంలో పేదవారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొల్లూరు మండలం జువ్వలపాలెం గ్రామానికి చెందిన విజయలక్ష్మి కుటుంబ సభ్యులకు శనివారం ఎమ్మెల్యే రూ. 1, 29, 470 విలువైన సీఎం సహాయనిధి చెక్కు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.