భట్టిప్రోలు రైల్వే గేట్ సమీపంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని రైల్వే అధికారులు కూల్చివేశారు. ఆక్రమణకు సంబంధించి ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకుని వచ్చినప్పటికీ దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జె సి బి తో నేలమట్టం చేసారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఇంజనీర్ జి. చంద్ర శేఖర్, జి. వెంకటప్పయ్య, రేపల్లె రైల్వే పోలీసులు పాల్గొన్నారు.