వేమూరు: నిబంధనలు ఉల్లంఘించిన వైన్ షాపులపై చర్యలు

76చూసినవారు
వేమూరు: నిబంధనలు ఉల్లంఘించిన వైన్ షాపులపై చర్యలు
ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించే వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్   వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం వేమూరు ఎక్సైజ్ స్టేషన్‌ను తనిఖీ చేసి, కేసుల నమోదుపై సమీక్ష నిర్వహించారు. అధిక ధరలకు మద్యం అమ్మినా, బెల్ట్ షాపులు నడిపినా చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రజల భద్రతకు ఇది అవసరమన్నారు.

సంబంధిత పోస్ట్