స్మార్ట్ మీటర్ల వలన వినియోగానికి మించిన విద్యుత్ బిల్లు వస్తుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారన్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఓబీసీ ఛైర్మన్ యార్లగడ్డ గోపి అన్నారు. మంగళవారం వేమూరులో గోపి మాట్లాడుతూ. బలవంతంగా స్మార్ట్ మీటర్లను అమర్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. మీటర్లు అమర్చే విషయంలో ప్రభుత్వం పునర్ఆలోచన చేయాలన్నారు.