అదుపు తప్పిన లారీ.. తప్పిన పెను ప్రమాదం

80చూసినవారు
అదుపు తప్పిన లారీ.. తప్పిన పెను ప్రమాదం
వినుకొండ పట్టణంలోని వెల్లటూరు రోడ్డులో ఆదివారం లారీ అదుపు తప్పి గోతిలో దిగబడింది. ఆ లారీలో సుమారు 50 మంది మహిళలు ఉన్నారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు. పట్టణంలో జరుగుతున్న పెళ్లి నిమిత్తం సత్తెనపల్లి నుంచి పెళ్లి బృందం లారీలో వినుకొండకు వచ్చారు. వెల్లటూరు రోడ్డులో మలుపు తిప్పుతూండగా లారీ ముందు టైర్లు గోతిలో దిగబడ్డాయి. అదే సమయంలో లారీ తిరగబడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదన్నారు.

సంబంధిత పోస్ట్