బొల్లాపల్లి మండలంలో ఫిబ్రవరి 27న ఆర్టీసీ బస్సులో ఆయిల్ చోరీకి గురైన సంగతి విదితమే. ఈ సంఘటనలో ముగ్గురు యువకులను బండ్లమోట్టు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్ఐ బాలకృష్ణ మాట్లాడుతూ మండలంలోని సీతారామపురంకు చెందిన ముగ్గురు యువకులు గుమ్మనంపాడులో నైట్ హల్ట్ బస్సు పార్కింగ్ చేసి ఉండగా, అందులో డీజిల్ చోరీకి పాల్పడ్డారు. పోలీసులు విచారణ చేపట్టి ముగ్గురు యువకులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.