ఇటుక ట్రాక్టర్ బోల్తా, యువకుడు మృతి

64చూసినవారు
ఇటుక ట్రాక్టర్ బోల్తా, యువకుడు మృతి
బొల్లాపల్లి మండలం వెల్లటూరులో బుధవారం ఇటుకలు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి యువకుడు మృతి చెందాడు. మృతుడు ముటుకులకు చెందిన మూరబోయిన అనంతరాము (వయసు 23)గా గుర్తించారు. వినుకొండ వెళ్తున్న ట్రాక్టర్ కొండ దిగాక ఎదురు వాహనం రావడంతో దిక్కు తెలియక ఎన్‌ఎస్‌పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్