నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం వినుకొండ డిపో గ్యారేజీ గేటు ఎదుట వరుసగా రెండో రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఆర్. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. కమిటీ చైర్మన్ పివి ఎస్. ఆర్ మూర్తి మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు భత్యం పెంచాలన్నారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ పనిష్మెంట్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు.