వినుకొండలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ

83చూసినవారు
వినుకొండలో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ
వినుకొండ పట్టణంలో వక్ఫ్ బోర్డు భూములపై కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ముస్లిం మైనారిటీలు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక శివయ్య స్తూపం వద్ద నిరసన తెలుపుతూ ఈ చట్టం ముస్లింల మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక హక్కులను ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాలీలో 2000 మందికిపైగా ముస్లింలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్