శావల్యాపురం ప్రభుత్వ వైద్యశాలను డిస్ట్రిక్ మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. రాబోయే వర్షాకాలంలో మలేరియా ప్రబలే అవకాశం ఉన్నందున, దోమల నియంత్రణ, దోమతెరల వాడకంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జ్వరం వస్తే వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని, మందులు వాడాలని తెలిపారు.