పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది శుక్రవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మండలంలోని గాటితండా, బ్రిడ్జితండా పరిసర ప్రాంతాల్లోని అడవిలో ఏవరైనా నాటుసారా తయారీ చేస్తున్నారేమోనని తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులను ఉద్దేశించి సీఐ డీ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఎవరైనా నాటు సారా తయారీ చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే సమాచారం తెలపాలన్నారు.