నకరికల్లులో అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును వేగంగా వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టిందని స్థానికులు తెలపారు. దీంతో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.