నూజెండ్ల మండలంలోని అన్ని గ్రామ సచివాలయాలలో సోమవారం యోగ ఆంధ్ర కార్యక్రమం పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఈవోపీఆర్డి మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా సిద్ధిస్తుందని అన్నారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు, స్వచ్ఛభారత్ మండల కోఆర్డినేటర్ కంచర్ల సుబ్బరామయ్య, సచివాలయ సిబ్బంది, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు