వినుకొండలో ఫించన్లు రీ వెరిఫికేషన్

68చూసినవారు
వినుకొండ మండలంలో వికలాంగుల పెన్షన్లు అధికారులు రీ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. వినుకొండ మండలంలోని ఉప్పరపాలెం, నరగాయపాలెంతో పాటు పలు గ్రామాల్లో వికలాంగుల పెన్షన్లు పొందుతున్న వారిని డాక్టర్ల బృందం విచారణ చేస్తున్నారు. వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు పెన్షన్లు పొందుతున్న వారు అర్హత సర్టిఫికెట్లు తీసుకురాగా డాక్టర్ల బృందం సర్టిఫికెట్లు, అంగవైకల్యం పరిశీలించి రిపోర్టును ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు.

సంబంధిత పోస్ట్