పిడుగురాళ్ల మండల వ్యవసాయ శాఖ ఏవో గా గురువారం సంధ్యారాణి నూతన బాధ్యతలు చేపట్టారు. గతంలో ఏవో సంధ్యారాణి దుర్గి, దాచేపల్లి ఏవోగా పనిచేశారు. బదిలీల్లో భాగంగా పిడుగురాళ్లకు రావడం జరిగింది. ప్రతి రైతు కూడా తమ సమస్యల విషయంలో నేరుగా కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు అన్నారు. అలానే రైతుల సమస్యల విషయంలో కార్యాలయ సిబ్బంది ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారన్నారు.