పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం శివయ్య స్తూపం సెంటర్లో శనివారం ప్రజలు స్మార్ట్ మీటర్ల అమలుపై నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అదానీ, ఇతర ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న అవినీతి కరెంటు ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయాలని యత్నిస్తున్నదని, ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర నిరసన తెలిపారు.