వినుకొండలో అక్రమ కట్టడాలు తొలగింపు

77చూసినవారు
వినుకొండలో మున్సిపల్ అధికారులు ఆక్రమణలను మంగళవారం సాయంత్రం తొలగించారు. పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్లే ప్రాంతంలో, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కొందరు షాపులను నిర్మించుకున్నారు. వాటిని జేసీబీ సహయంతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తొలగించారు. నిర్మాణాలు చేసే సమయంలో పట్టించుకోని అధికారులు ఇప్పుడు కూల్చడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు.

సంబంధిత పోస్ట్