శావల్యాపురం ప్రాథమిక వైద్యశాలలో బుధవారం హాస్పటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించినట్లు డాక్టర్ రాధాకృష్ణన్ తెలిపారు. ఈ సమావేశంలో, హాస్పటల్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు, రోగులకు మంచినీటి సదుపాయం, హాస్పటల్ పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలను తొలగించడం, తాత్కాలిక ఉద్యోగుల జీతాల గురించి తీర్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఛైర్మన్ సుహాసిని, ఎంపీడీవో సీతారామయ్య, సిబ్బంది పాల్గొన్నారు.