పిడుగుపాటుకు ఎకరం పొలంలో వరి గడ్డి దగ్ధమైన సంఘటన శావల్యాపురం మండలంలోని శివారు గుంటుపాలెం భాస్కరనగరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, గ్రామంలో బుధవారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు పడి మాలెపాటి వెంకటరెడ్డికి చెందిన పొలంలో వరిగడ్డి పూర్తిగా తగలబడింది. పశువులకు మేత లేకుండా పోయిందని బాధితుడు వాపోయాడు.