సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండల పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శావల్యాపురం ఎస్ఐ లోకేశ్వరావు హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు వేరే ఊర్లు వెళ్లేవారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని సూచించారు. తద్వారా సమయాల్లో ఇంటి వద్ద గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించాలన్నారు.