శావల్యాపురం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

76చూసినవారు
శావల్యాపురం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు. వర్షాకాలం రానున్న నేపథ్యంలో దోమలు పెరిగి మలేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దోమల బారిన పడకుండా ప్రజలు దోమతెరలు వాడాలని తెలిపారు. సిబ్బంది విధులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్