చేపల విక్రయాలకు స్థలం కేటాయించాలి

58చూసినవారు
చేపల విక్రయాలకు స్థలం కేటాయించాలి
వినుకొండ పరిధిలోని గుండ్లకమ్మ చెరువులో చేపలు పట్టుకుని పట్టణంలో అమ్ముకోవడానికి వస్తున్న చిరు వ్యాపారులను, కొందరు బడా వ్యాపారస్తులు అడ్డుకుంటున్నారని మంగళవారం వారు తెలిపారు. పట్టణంలో చేపలు అమ్మటానికి వీలు లేదని హెచ్చరించినట్లు తెలిపారు. దీంతో తమకు చేపలు విక్రయాలకు స్థలం కేటాయించాలని మున్సిపల్ అధికారులకు పలువురు మత్స్యకారులు వినతిపత్రం ఇచ్చారు.