వినుకొండలో పలు గ్యాస్ ఏజెన్సీలు వినియోగదారులను దోచుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. గ్యాస్ కంపెనీ నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోవాలని కోరడంతో, ఈకేవైసీ కోసం గ్యాస్ కార్యాలయం వద్ద మహిళలు బారులు తీరుతున్నారు. కొన్ని గ్యాస్ కంపెనీలు అదనంగా రూ. 300 చెల్లించి గ్యాస్ పైపు తీసుకుంటేనే ఈ కేవైసీ చేస్తామనడంతో వినియోగదారులు శుక్రవారం తహశీల్దార్ కు ఫిర్యాదు చేశారు.