ట్రక్ బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు

2582చూసినవారు
ట్రక్ బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు
నూజెండ్ల - వి. అప్పాపురం గ్రామాల మధ్య ఉన్న కాలువలో మినీ ట్రక్ బోల్తాపడి 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం జరగ్గా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మారెళ్ళవారిపాలెంకు చెందిన రైతులు, కూలీలు 35 మంది 2 మినీ ట్రక్కుల్లో శ్రీశైలం, మహానంది వెళ్లి తిరిగి వస్తున్నారు. కాలువ బ్రిడ్జి వద్ద మినీ ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడటంతో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్