వినుకొండ: సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

51చూసినవారు
వినుకొండ: సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
వినుకొండ పురపాలక సంఘ పరిధిలో బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ బుధవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఈనెల 22వ తేదీలోపు కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అర్హత కలిగిన బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కాపు, కమ్మ, క్షత్రియ కార్పొరేషన్లకు సంబంధించిన లబ్ధిదారులకు బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అందజేయనున్నట్లు కమిషనర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్