అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా 4వ రోజు గురువారం వినుకొండ అగ్నిమాపక కేంద్రం యొక్క కేంద్ర అధికారి, సిబ్బంది నరసరావుపేట రోడ్డులో గల నిర్మల ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు తరగతి గదులలో అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఏ విధముగా వాటినుండి బయటపడాలి అని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్లు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్కూట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రతలపై కూడా అవగాహన కల్పించారు.