భారత మాజీ ఉప ప్రధాని, స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం వినుకొండ పట్టణంలో ఎమ్మెల్యే జివి ఆంజనేయులు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.