గత ఐదేళ్ల వైసిపి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు. జీవీ ఆంజనేయులు విమర్శించారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో మహిళలపై జరిగిన దాడులను అన్యాయాలను ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం రాగానే 9 నెలల్లో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు, మహిళల ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు.