తన మామ అప్పులు ఉన్నాయంటూ అత్తారింటి నుండి వచ్చిన ఆస్తిని మరల లాగేసుకోవడానికి బెదిరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ ఈఫ్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కాపాడాలంటూ కోడలు చిలకలూరిపేట గోళ్ళ బిందు అనే మహిళ తన ఇద్దరి పిల్లలతో కలిసి బుధవారం వినుకొండ పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. తన మామ గోళ్ళ మహేశ్వరరావు, ఫోర్జరీ సంతకలతో ఆస్తులను బదులాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. ఆస్తులుగా ఉన్న భవనాల తాళాలను పగలగొట్టారని, ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనకు న్యాయం చేయాలని వేడుకుంది.