వినుకొండ: డ్రైనేజీలలో పూడికతీత పనులు ప్రారంభం

74చూసినవారు
వినుకొండ: డ్రైనేజీలలో పూడికతీత పనులు ప్రారంభం
వినుకొండ పురపాలక సంఘం పరిధిలోని ప్రధాన డ్రైనేజీలలో డీసిల్టేషన్ చేయిస్తున్నట్లు బుధవారం కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. వర్షాకాలం రాబోతున్న నేపథ్యంలో డ్రైనేజీలు నిండి రోడ్లపై నీరు ప్రవహించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మార్కాపురం రోడ్, తిమ్మాయి పాలెం రోడ్ ఇసుక వాగు మెయిన్, పల్నాడు రోడ్డు మెయిన్ డ్రైనేజీ మొదలగు ప్రాంతాల్లో డీసిల్టేషన్ పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్