వినుకొండ: వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన అసమ్మతి వర్గం

58చూసినవారు
పల్నాడు వినుకొండ పట్టణంలో బుధవారం బొల్లా బ్రహ్మనాయుడు కి వ్యతిరేక వర్గమైన వైసీపీలోని రెండో వర్గం వారు పార్టీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదట పట్టణంలోని చెక్ పోస్టు సెంటర్ లో మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం శావల్యాపురం పార్టీ నాయకుడు చుండూరి వెంకటేశ్వర్లు అధ్వర్యంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్