వినుకొండ పట్టణంలో దేవాదాయ శాఖ ఈఓగా సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన హనుమంతరావు బదిలీపై కారంపూడి వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా స్ధానిక ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులును కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సంధర్భంగా జీవీ మాట్లాడుతూ పట్టణంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయనకు సూచించారు.