వినుకొండ: ఈ నెల 21న మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్ష

75చూసినవారు
వినుకొండ: ఈ నెల 21న మోడల్ స్కూల్లో ప్రవేశ పరీక్ష
మోడల్ స్కూల్లో ప్రవేశాలకు జరిగే పరీక్షలను విద్యాశాఖ అధికారులు తేదీ మార్పు చేశారు.. వినుకొండ మండలం చీకటీగలపాలంలోని మోడల్ స్కూల్లో 2025-26 విద్యా సంవత్సరంకు 6వ తరగతిలో చేరే విద్యార్థులకు ఏప్రిల్ 20న జరగాల్సిన ప్రవేశ పరీక్ష ఈస్టర్ పండుగ సందర్భంగా, ఏప్రిల్ 21 సోమవారంకు మార్చినట్లు శుక్రవారం ప్రిన్సిపాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్