వినుకొండ: అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

అగ్నిమాపక వారోత్సవాలు సందర్భంగా మూడవ రోజు బుధవారం వినుకొండ అగ్నిమాపక కేంద్రం కేంద్రాదికారి, సిబ్బంది పట్టణంలోని కారెంపూడి రోడ్డులోని గొల్దెన్ టవర్స్ అపార్ట్మెంట్ లో నివాసముంటున్న కుటుంబాలకు, చుట్టుపక్కల ప్రజలకు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. వేసవి కాలంలో ఇండ్లల్లో సంభవించే గ్యాస్ ఫైర్ యాక్సిడెంట్లు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్కూట్, ఆయిల్ ఫైర్స్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రతలు, అగ్ని ప్రమాదాల నివారణ చర్యలను వివరించారు.