రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారం నాటికి 11 వ రోజుకు చేరుకున్నాయి. ఈ సమావేశాల్లో వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జీవీ మాట్లాడుతూ వైన్ షాప్ వ్యాపారులు కొందరు నష్టాల్లో ఉన్నారని తెలిపారు. వారికి అమ్మకాల పై 20 శాతం కమిషన్ ఇస్తే నష్టాల భారీ నుంచి బయటపడతారన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో మద్యం పాలసీలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.