వినుకొండ: మైనర్ ఇరిగేషన్ కాలువ రిపేరు పనులు చేపట్టాలి

59చూసినవారు
వినుకొండ: మైనర్ ఇరిగేషన్ కాలువ రిపేరు పనులు చేపట్టాలి
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రోడ్డు నుండి నరసరావుపేట రోడ్డు వరకు ఒక కిలోమీటర్ కు పైగా కాలువ రెండువైపులా కంప చెట్లు పెరిగి, రహదారి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులకు అర్జీలు పెట్టడంతో ఇటీవల రెండు వైపులా సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. బుధవారం ఈ కాలువ పనులు వర్షాకాలానికి ముందే మరమ్మతులు పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎన్ ఎస్పీడీఈకి మెమొరండo ఇచ్చారు.

సంబంధిత పోస్ట్