తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కొండపై శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన అఖండ జ్యోతిని ప్రభుత్వ చీఫ్ విప్, శాసనసభ్యులు జివి ఆంజనేయులు , ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెలిగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ జ్యోతిని పూజించడం వలన ప్రజలకు ఎంతో శుభం జరుగుతుందని తెలిపారు. అఖండ జ్యోతిని 1000 కిలోల ఆవు నెయ్యి, 650 మీటర్ల ఒత్తితో ట్రస్ట్ వారు తయారు చేయడం ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు.